ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి.. ఇక తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు గెలుపు పై ఆశలు పెట్టుకున్నాయి… ఈ సమయంలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కచ్చితంగా 25 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని సర్వేలు తెలియచేస్తున్నాయి…కాని మెజార్టీ సీట్లు మాత్రం వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది అని చెబుతున్నాయి సర్వేలు.. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి ..సర్వేలు మాత్రం ఎవరి ఇష్టం వచ్చిన రీతిన వారు విడుదల చేస్తున్నారు.. అన్నీ వైసీపీకి గెలుపు అని చెబుతున్నాయి.. గత ఎన్నికల్లో కూడా ఇలాగే సర్వేలు వచ్చాయి. అప్పుడు ఫలితాలు మాత్రం పూర్తి రివర్స్ అయ్యాయి..
అయితే ఈ మధ్య వైసీపీలో అంతర్గత కొట్లాటలు నడుస్తున్నాయని సమాచారాం.. ఎందుకు అంటే ఇంకా ఫలితాలు రాలేదు కాని కొందరి పేర్లు మంత్రి పేర్లుగా వినిపిస్తున్నాయి.. అయితే ఇదంతా రాంగ్ అని వైసీపీ చెబుతుంది.. కాని వారికి మాత్రమే మంత్రి పదవులు అంటే తాము ఎప్పటి నుంచో ఉన్నాము మాకు మంత్రి పదవులు లేవా అని వారు మండిపడుతున్నారట.. ఇలా పేర్లు బయటకు రావడానికికారణం ఏమిటి అని ? తెగ హైరానా పడుతున్నారట. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశమైన విషయం అయింది. మరి దీనికి జగన్ ఏమి చేస్తారు అంటే అసలు ఇలాంటి గాసిప్ వార్తలు వచ్చిన సమయంలో వీటిని నిరోధించాలి అని చెబుతున్నారు.