ప‌శ్చిమబెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ పై దాడి

-

ప‌శ్చిమబెంగాల్ లో ఎన్నిక‌ల సంద‌డి క‌నిపిస్తోంది… నువ్వా నేనా అనేలా ఉన్నాయి ప్ర‌చారంలో రాజ‌కీయ పార్టీలు.. ఇక ఈసారి ఎలాగైనా ఇక్క‌డ గెల‌వాలి అని అన్నీ రాజ‌కీయ పార్టీలు పావులు క‌దుపుతున్నాయి.. ముఖ్యంగా తృణ‌ముల్ బీజేపీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ అనేది క‌నిపిస్తోంది, ఈ స‌మ‌యంలో తాజాగా
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు.నందిగ్రామ్ లో ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తృణ‌ముల్ కు ఇటీవ‌ల రాజీనామా చేసి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారిపై ఆమె పోటీ చేస్తున్నారు. ఇక ఆమె నామినేష‌న్ వేసేందుకు అక్క‌డ‌కు వెళ్లారు.ఈ స‌మ‌యంలో రాత్రి అక్క‌డ బ‌స చేయాల్సి ఉంది.. కాని ఆమె దాడి ఘ‌ట‌న త‌ర్వాత అక్క‌డ నుంచి
కోల్ క‌తాకు ప‌య‌నం అయ్యారు….నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పారు. కారు ఎక్కుతున్న స‌మ‌యంలో త‌న‌ని నెట్టారని ఆమె తెలిపారు. ఇక్క‌డ త‌న ప‌ర్య‌ట‌న ఉన్నా ఒక్క పోలీస్ కూడా లేరు అని తెలిపారు, దీని వెనుక కుట్ర ఉంది అని ఆమె ఆరోప‌ణ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...