జాతిరత్నాలు సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాలో అందరి నటన సూపర్ అంటున్నారు, అంతేకాదు కామెడీ అద్బుతం టైమింగ్ బాగుంది అని ప్రతీ ఒక్కరు అంటున్నారు, ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది, బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదు చేసింది.
ఈ చిత్రంలో యువ కథానాయకుడుగా నవీన్ పోలిశెట్టి నటన చాలా బాగుంది , యూత్ కి బాగా నచ్చింది ఈ సినిమా..మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు… దీంతో అతనికి ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి… ఈ క్రమంలో ప్రముఖ నటి అనుష్క సరసన నటించే ఛాన్స్ ఈ కుర్రాడికి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ లో దీనికి సంబంధించి ఓ వార్త అయితే వినిపిస్తోంది.
నిశ్శబ్దం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఓ వెరైటీ ప్రేమకథ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. దర్శకుడు మహేశ్ ఈ చిత్రం చేయనున్నారు, అయితే ఈ చిత్రంలో నవీన్ ని తీసుకుంటారు అని టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో..
నలభై ఏళ్ల మహిళ.. పాతికేళ్ల కుర్రాడి మధ్య ప్రేమకథగా ఇది తెరకెక్కుతుందట. సో దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి – దర్శకుడు ఎవరంటే – టాలీవుడ్ టాక్
-