తేనె ఆరోగ్యానికి చాలా మంచిది.. అంతేకాదు ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి, దీనిని నిత్యం తీసుకునే వారు ఉంటారు..ఉదయం తెనె నిమ్మరసం చాలా మంది తీసుకుంటారు.. ఇక ఎవరైనా ఉపవాసం ఉన్నా తెనె నీరు నిమ్మరసం ఇలా తీసుకుంటారు, అయితే మంచి పుట్ట తెనె ఎంత ఉంటుంది బాటిల్ కచ్చితంగా 500 తీసుకుంటున్నారు ఇప్పుడు… ఇక కంపెనీల తెనె అయితే దాదాపు అది కూడా అరకిలో 150 నుంచి 300 ఉంటోంది….కాని చెట్ల నుంచి సేకరించి అడవుల నుంచి తీసుకువస్తే ఆ తెనె ఎక్కువ రేటు పలుకుతుంది… ఒరిజినల్ తేనెగా చాలా మంది తీసుకుంటారు.
అయితే టర్కీలో సెంటారీ హానీ అనే కంపెనీ తయారు చేసే తేనే ప్రపంచంలోనే ఖరీదైన తేనెగా రికార్డ్ సాధించింది. ఎందుకు అంటే ఈ తెనె ఖరీదు ఏకంగా బాటిల్ 8.8లక్షలు. ఈ తేనెకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. టర్కీ సెంటారీ కంపెనీ తయారు చేసే హానీ డార్క్ కలర్ లో ఉంటూ రుచికి కొంచెం చేదుగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ .
కాని ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇది సాధారణంగా చెట్ల నుంచి పుట్టల నుంచి తీస్తారు అని అనుకుంటున్నారా.
కాదు సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తుల్లో ఉండే గుహల్లో నుంచి మాత్రమే ఈ కంపెనీ తేనెను సేకరిస్తుంది. దీని కోసం 500 మంది వర్క్ చేస్తున్నారు. ఈ తెనెకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే నెలకి ఇస్తారట.