ట్యాబ్లెట్స్ వేడి నీటితో మంచిదా చల్ల నీటితో మంచిదా ? దానితో అస్సలు తీసుకోవద్దు

-

మనం ఏదైనా ఒంట్లో నలతగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా వెంటనే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం.. అయితే ఇది
 జీర్ణాశయంలోకి చేరి కరిగేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇలా అది కరిగి మన రక్తంలో కలుస్తుంది, ఇలా శరీరంలో అది చేరిన తర్వాత ఐదు గంటల తర్వాత ఆ మందు ప్రభావం చూపిస్తుంది. అయితే సాధారణ నీరుతో కొందరు మరికొందరు గోరు వెచ్చని నీటితో ఈ మందులు వేసుకుంటారు.
అయితే గోరు వెచ్చని నీటిలో ఈ మందు కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఇక కూల్ వాటర్ తో మందులు వేసుకోకూడదు, ఎందుకు అంటే ఇది రక్తంలో కలవడానికి కొంచెం సమయం పడుతుంది.
గోరు వెచ్చని నీటిలో ట్యాబ్లెట్లు కలిపి వేసుకుంటే త్వరగా చిన్న పేగులోకి వెళ్తుందట. దీంతో రక్తంలోకి క్షణాల్లో కలుస్తుందట.
కొందరు మందులు పాలతో కాఫీ టీతో వేసుకుంటారు ఇలా వేసుకోకూడదు, ఇక పిల్లలు మారాం చేస్తున్నారు అని వారికి బాదం మిల్క్ లో జ్యూస్ లో కలిపి ఇస్తారు, ఇది మంచిది కాదు పాలు టీ కాఫీతో అస్సలు మందులు వేసుకోవద్దు అంటున్నారు
వైద్యులు..కాఫీ, టీల తో మాత్రలు వేసుకుంటే ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయి. యాంటీ బయోటిక్స్ వంటి కొన్ని రకాల మాత్రలు పాలులో వేసుకుంటే దాని ప్రభావం పోతుంది. ఇక మీరు ఎట్టి పరిస్దితుల్లో జ్యూస్ తో మందులు వేసుకోవద్దు. ఇక నీరు లేకుండా మందులు వేసుకుంటే చాతీలో మంట ఎక్కువగా వస్తుంది.. సో మందులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...