పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓపక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.. ఆయన ఇప్పుడు మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా కూడా పూర్తి చేశారు ..మరో పక్క విడుదల తేదీ కూడా వచ్చేసింది.. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు… అయితే ఇటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు, అయితే ఆయన నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంతేకాదు ఆయనలో మంచి గాయకుడు ఉన్నాడు అనేది తెలిసిందే.
గత చిత్రాల్లో పలు పాటలు పాడి తన అభిమానులని ఖుషీ చేశారు ఆయన.. ఇప్పటి వరకు తొమ్మిది పాటలు పాడిన పవన్ ప్రతి పాటతో అలరించాడు. తాజాగా మరో పాట పాడేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది. ఇప్పుడు పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ అనే మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పవన్, రానా నటిస్తున్నారు. దీనికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ రానా ఓ పాట పాడతారట, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వార్త అయితే టాలీవుడ్ లో వినిపిస్తోంది, మొత్తానికి అభిమానులు మాత్రం ఈ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.