| పెళ్లి ఫంక్షన్ జరిగింది అంటే అక్కడ గుత్తి వంకాయ కూర ఉండాల్సిందే, ముఖ్యంగా ఫంక్షన్లలో మన దేశంలో చాలా చోట్ల వంకాయ కూర కామన్ ..అయితే సినిమాల్లో కూడా  ఈ వంకాయ మీద పాటలు కూడా అలాగే ఉన్నాయి…గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్లు కనిపించడం చాలా అరుదు…. అయితే మీకు తెలుసా గుత్తి వంకాయ చాలా మంచి రుచితో పాటు పోషకాలు కలిగి ఉంటుంది. వంకాయలు తరచూ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడుకి చాలా మేలు చేస్తుంది, ఇక  జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు, ఆంతోసైయానిన్లు ఎక్కువగా ఉండటం వల్ల మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అంతోసియానిన్ అనే పిగ్మెంట్ వల్ల గుండె పనితనం చాలా బాగుంటుంది. మీకు శరీరంలో ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అందుకే వారానికి ఓసారి అయినా వంకాయ తింటే చాలా మంచిది. ఎముకలు సామర్థ్యాన్ని పెంచి ఐరన్, కాల్షియం అందిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరైనా ఊబకాయం బరువుతో ఇబ్బంది పడుతున్నారా, మీరు ఇది తీసుకోవచ్చు.. ఎందుకు అంటే వంకాయలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉండి, వెయిట్ లాస్ డైట్ ప్లాన్ కు ది బెస్ట్ అని చెబుతారు. ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఇబ్బంది ఉండదు..ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు ఏమీ రావు మలబద్దకం కూడా ఉండదు. 
 
 |  | 
వంకాయ తింటున్నారా దీని ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి
-
 
                                    


