సాధారణంగా సబ్బు ధర ఎంత ఉంటుంది మనం శరీరానికి వాడే సబ్బు దాదాపు 25 రూపాయల నుంచి 1000 రూపాయల వరకూ ఉంటుంది, ఇక పెద్ద పెద్ద కంపెనీల సబ్బులు 2000 లేదా 3000 వరకూ ఉంటాయి… ఇంతకు మించి ధర ఉండదు.. అయితే ఇప్పుడు మీరు వినే సబ్బు గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు..ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు.
ధర కేవలం రూ.2.07 లక్షలు, ఏమిటి ఏకంగా లక్షల రూపాయల ఖరీదైన సబ్బు అని ఆశ్చర్యపోతున్నారా, దాని స్పెషాలిటీ కూడా అలాంటిదే, ఇందులో తయారీకి 17 గ్రాముల బంగారం కూడా వాడారు, అంతేకాదు కొన్ని మేలిమి వజ్రాలు నెగిషీ చేసే సమయంలో వచ్చే పొడి వాడారట, దీన్ని తయారుచేసిన బడేర్ హసన్ అండ్ సన్స్ వాళ్లు ఈ విషయం చెప్పారు.
ఈ సబ్బు గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు, ఇంత ఖరీదైన సబ్బు ఉంది అని ఎవరికి ఇప్పటి వరకూ తెలియదు..
ఇంకా ఇందులో ఏమి వేశారు అంటే అలీవ్ నూన్, ఆర్గానిక్ తేనె, ఖర్జూరం ఇవన్నీ వేసి చేశారు, సో మరి ఈ సబ్బు ఎక్కడ తయారుచేశారు అంటే …లెబనాన్లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్ మేడ్ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో చాలా పేరున్నవారు, వారే దీనిని తయారు చేశారు.