మీకు పంటి నొప్పి వేధిస్తోందా అయితే ఈ చిట్కాలు పాటించండి 

-

పంటి నొప్పి వచ్చింది అంటే అస్సలు తట్టుకోలేము.. అయితే చాలా మంది అనేక రకాలా మందులు వేసుకుంటారు.. కొందరికి అయినా ఆ పెయిన్ మాత్రం తగ్గదు, ఇక ఇంటి చిట్కాలు కూడా చాలా మంది పాటిస్తారు.. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఆకులు ఇలాంటివి తీసుకుని దాని ద్వారా ఉపశమనం పొందుతారు.
ఒక్క పన్ను నొప్పి పుట్టినా మొత్తం నరాలన్నీ లాగేస్తున్నంత బాధ కలుగుతుంది. ఇక నీరు కూడా తాగలేము, అసలు ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేము, ఇక పుచ్చిన దంతం అయితే ఇక పగుల్లు ఉన్నా అందులో తిన్న ఐటెం ఇరుక్కుంటుంది చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే దీనికి ఉపశమనం ఎలా పొందాలి అంటే.
ఉప్పు వేడినీటిలో కలపండి …దీనిని నోటిలో వేసుకుని పుక్కిలించండి, ఈ ద్రావణం మీకు సహజమైన యాంటి సెప్టిక్లా పని చేస్తుంది. కనీసం 30 సెకన్లపాటు ఉప్పు నీటిని పుక్కిలించండి. దీని వల్ల పళ్ల మధ్య ఉన్న వ్యర్దాలు పోతాయి, ఇక ఇన్ ఫెక్షన్లు సోకవు. ఇక లవంగాలు కూడా చాలా మంది ఆ పంటి మద్యన పెట్టుకుంటారు… ఇందులో ఉండే యుగేనల్ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. అందులోనుంచి వచ్చే నూనెలాంటి పదార్దం వల్ల నొప్పి తగ్గుతుంది. లవంగ నూనె కూడా పంటిపై అద్ది పెట్టుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...