ఇటీవల కర్నూలు విమానాశ్రయం ప్రారంభంకావడంతో రద్దీ పెరిగింది, సీమ ప్రజలు కర్నూలు వాసులు చాలా ఆనందంలో ఉన్నారు, ఇక ప్రయాణ సమయం కూడా చాలా వరకూ తగ్గుతుంది. ఇక విమానాశ్రయం ప్రారంభం కావడంతో
అక్కడకు ఆర్టీసీ బస్సులు నడిపుతోంది.
ఈరోజు నుంచి ఇంద్ర ఏసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 40 సీట్లు కలిగిన బస్సులు కర్నూలు నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం వరకు నడుస్తాయి. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు బస్టాండు వరకు నడుస్తాయి.
ఇక సర్వీసులు ఓసారి చూద్దాం
సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు బస్టాండ్ నుంచి ఉదయం 8 గంటలకు బయల్దేరి విమానాశ్రయానికి 8.45 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30కు ఎయిర్పోర్ట్కు వస్తుంది. మొత్తానికి దీని వల్ల ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.