బాల ఆధార్ కార్డులు ఎలా తీసుకోవాలి – ఏ వయసు వారికి ఇస్తారు

బాల ఆధార్ కార్డులు ఎలా తీసుకోవాలి - ఏ వయసు వారికి ఇస్తారు

0
33

మనం ఆధార్ కార్డ్ తీసుకుంటాం. మరి చిన్న పిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ ఎలా తీసుకోవాలి వారికి ఎలాంటి ఆధార్ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పుడే పుట్టిన నెలల పిల్లలకు ఐదేళ్లలోపు పిల్లలకు బాల ఆధార్ ఇస్తారు. ఇవి బ్లూ రంగులో ఉంటాయి. ఐదేళ్లలోపు వయసు ఉన్న వారికి ఈ కార్డులు వస్తాయి. ఇక కచ్చితంగా తల్లితండ్రి ఇద్దరూ వెళ్లాలి మీ ఆధార్ కార్డు డీ టెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

 

 

పిల్లలకు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ వంటివి తీసుకోరు. తల్లి దండ్రుల చిరునామా వారి పేర్ల ఆధారంగా వారికి కొత్త ఆధార్ ఇస్తారు,,, ఇక ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. ఇవి కేవలం పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ ఉంటాయి, ఆ తర్వాత దీనిలో డీటెయిల్స్ అప్ డేట్ చేయించాలి, అంతేకాదు పిల్లలకు అప్పుడు బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలి.

 

పిల్లల బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. అలాగే పిల్లల ఆధార్ సెంటర్కు వెళ్లే వారి ఆధార్ కార్డు కూడా కావాలి. తల్లిదండ్రులు ఇవి జిరాక్స్ కాపీలు తీసుకువెళ్లినా సరిపోతుంది. మీ పిల్లలకు ఇది నమోదు చేయించిన రెండు వారాల తర్వాత కార్డు ఇంటికి నేరుగా వస్తుంది.