చాలా మంది ఇంట్లో కుక్కలని ఎలా పెంచుకుంటారో పిల్లులని అలాగే పెంచుకుంటారు.. అది కనిపించకపోతే అస్సలు ఉండలేరు. చాలా దేశాల్లో కుక్కల కంటే పిల్లులని ఎక్కువ పెంచుకుంటారు.. అయితే ఆ ఇంట్లో అప్పటి వరకూ సందడిగా తిరిగిన పిల్లి ఒక్కసారిగా కనిపించలేదు… దీంతో ఆ ఇంట్లో వారు ఇళ్లు అంతా వెతికారు.
ఓ గదిలో పిల్లికి బదులు కొండ చిలువ కనిపించింది. కడుపు బాగా నిండటంతో అది నెమ్మదిగా కదులుతోంది. ఇక వెంటనే ఇంటి యజమానికి అక్కడ ఏం జరిగిందో తెలిసింది, వెంటనే అధికారులకి కాల్ చేసి విషయం చెప్పింది, ఈ దారుణమైన ఘటన
థాయ్లాండ్లో చోటుచేసుకుంది.
కాంచీ నార్ద్ అనే యువతి హర్జూన్ అనే పిల్లిని పెంచుకుంటోంది. అంతా వెతికిన తర్వాత వంటగది స్లాబ్ మీద కొండచిలువ కనిపించింది. దాని కడుపు పెద్దగా కనిపించడంతో అదే మింగేసింది అని అర్దం అయింది. ఇక దాని కడుపుతో ఉన్న పిల్లిని తీయడం కష్టం అని అధికారులు తెలిపారు.. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది, ఆ కొండ చిలువ ఇంట్లోకి ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ అర్దం కానిది.
https://www.facebook.com/Kanchi.Dao/posts/4181745868516865