100 రూపాయలతో అతని లైఫ్ మారిపోయింది – కోటీశ్వరుడు అయ్యాడు.

100 రూపాయలతో అతని లైఫ్ మారిపోయింది - కోటీశ్వరుడు అయ్యాడు.

0
98
Karnataka

ఒక్కోసారి అదృష్టం ఇంటి తలుపు తట్టీ మరీ వస్తుంది, కొందరి జీవితాలను మార్చేస్తుంది.. ఇక్కడ కూడా అదే జరిగింది అదృష్టం అతని తలుపు తట్టింది, అతని లైఫ్ ని మార్చేసింది.. ఓ నిరుపేద సెక్యూరిటీ గార్డు విషయంలో ఇదే జరిగింది. ఓ వంద రూపాయల లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. కష్టాల నుంచి అతక్కి గట్టెక్కించింది.

కర్ణాటకలోని మంగళూరులో సెక్యూరిటీ గార్డుకు లాటరీలో రూ.కోటి వరించింది. కేరళ భాగ్యమిత్ర లాటరీ అతనికి తగిలింది అతను ఎంతో ఆనందంలో ఉన్నాడు..మంగళూరులో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మోయిద్దీన్ కుట్టి స్వస్థలం కేరళ. కాని కుటుంబంతో ఇక్కడ ఉండి పని చేసుకుంటున్నాడు ఇటీవల లాటరీ కొన్నాడు.

ఏప్రిల్ 4న రూ.100కు కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్ కొన్నాడు. ఇక అప్పు చేసి మరీ ఆ లాటరీ కొన్నాడు. దానికి అతనికి కోటీ రూపాయలు తగిలింది.. అతను చాలా ఆనందంలో ఉన్నాడు. ఇక చేతికి నగదు రాగానే ఈ ఉద్యోగం మానేసి భార్య పిల్లలతో కేరళ వెళ్లిపోతాను అక్కడ వ్యాపారం చేస్తాను అంటున్నాడు.