ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి – ఎలా చేయాలి తప్పక తెలుసుకోండి

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి - ఎలా చేయాలి తప్పక తెలుసుకోండి

0
96

ఉగాది రోజున కచ్చితంగా అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు.. అయితే ఉగాది పచ్చడిని గుడిలో కూడా ప్రసాదంగా ఇస్తారు, ఇళ్లల్లో కూడా చేసుకుంటారు, ఇందులో వేసే ప్రతీ ఆహార పదార్దం రుచులకు కారణం అవుతుంది.

ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది.

 

మరి ఇందులో వాడే ఒక్కో పదార్ధాం ఒక్కో భావానికి ప్రతీకలు అనే చెప్పాలి, సో మరి అవి ఏమిటి అనేది చూద్దాం.

ఈ పచ్చడిలో ముఖ్యంగా మనం బెల్లం వేప చింతపండు మామిడి కారం ఉప్పు వాడతాం, ఒక్కో దానికి ఒక్కో కారణం చెబుతారు

 

బెల్లం- తీపి… ఆనందానికి గుర్తుగా వేస్తారు.

వేప పువ్వు – చేదు… జీవితంలో బాధకలిగించే అనుభవాలకు గుర్తుచేస్తుంది.

చింతపండు – ఇది పులుపు.. నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు గుర్తు చేస్తుంది.

ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంగా ఉంటుంది.

పచ్చి మామిడి ముక్కలు – వగరు.. కొత్త సవాళ్లు ఎదుర్కోవడానికి

కారం – సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు