ఉగాది ప్రాముఖ్యత తెలుసా తప్పక తెలుసుకోండి

ఉగాది ప్రాముఖ్యత తెలుసా తప్పక తెలుసుకోండి

0
40

ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 13న జరుపుకుంటారు..ఏప్రిల్ 12 ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 13 ఉదయం 10.16 గంటలకు ముగుస్తుంది. ఇక ఉగాది ప్రాముఖ్యత ఏమిటి అనేది చూద్దాం…చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని అప్పటి నుంచి ఈ అనంత సృష్టి ప్రారంభం అయిందని చెబుతారు, అందుకే ఇలా చైత్ర శుక్ల పాడ్యమి రోజు ఉగాదిని మనం జరుపుకుంటాం.

 

వేదాలను హారించాడని సోమకుని వధించేందుకు విష్ణువు మత్య్సవతారంలో వచ్చి అతడిని వధించాడు,.. ఆ తర్వాత వేదాలను తీసుకువచ్చి విష్ణువు బ్రహ్మకు ఇచ్చారు, ఆరోజు నుంచి ఉగాది జరుపుకుంటున్నారు. ఈ సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టించాడని చెబుతారు పండితులు

 

ఉగాది నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడని.. ఆరోజునే ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితిగా వస్తుంది అని మరికొంత మంది చెబుతారు, ఈ రోజు ఉదయం స్నానం ఆచరించి ఇష్టదైవాన్ని కొలచి పచ్చడి చేసుకుని దేవాలయానికి వెళ్లాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి.