చంద్రబాబుకు ఇది గుడ్ న్యూస్

చంద్రబాబుకు ఇది గుడ్ న్యూస్

0
101

వైసీపీ అధికారంలోకి వస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి 50 నుంచి 60 సీట్లు కూడా వచ్చే పరిస్దితి లేదు అని చెబుతున్నారు. కాని తెలుగుదేశం నేతలు మాత్రం ఫలితాలు వచ్చే వరకూ ఎలాంటి విమర్శలు చేయకూడదు అని, గత ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి కామెంట్లు వైసీపీ నేతలు చేశారుచ, దీనికంటే ఇంకాస్త ప్రచారం ఆ నాడు ఎక్కువే చేశారు.. కాని చివరకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.. అయితే మహిళా ఓటు బ్యాంకు ఎవరికి పాజిటీవ్ అయింది అనేది ఎవరికి తెలియదు. ఇది జగన్ కు కూడా కాస్త టెన్షన్ పెట్టిస్తున్న అంశం. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలు ఫలితాల రోజు చూసుకోవాలి అని భావిస్తున్నారు.. కేవలం మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేయడంతో ఇది పసుపు కుంకుమ ఎఫెక్ట్ అలాగే పేదలకు ఇళ్లు ఇవ్వడం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అని చెబుతున్నారు పార్టీ నేతలు.

తాజాగా ఎవరికి మద్దతు రాకుండా పవన్ కు కూడా 30 నుంచి 20 స్ధానాలు వస్తే చేసేది ఏమిటి అంటే కచ్చితంగా ఆయన చంద్రబాబుకి మద్దతు ఇస్తారా లేదా జగన్ కు మద్దతు ఇస్తారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఏపీలో తలెత్తింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఆ సమయం బట్టీ పవన్ నిర్ణయం తీసుకుంటారు అని చెబుతున్నారు.. కాని వాస్తవంగా ఇక్కడ జరిగేది వేరు అని తెలుస్తోంది.. పవన్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారట. అంతేకాదు ఆయన జగన్ కు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేయరట.. ఒకవేళ చేసినా జనసేన శ్రేణుల నుంచి విమర్శలు వస్తాయి అందుకే ఆయన చంద్రబాబుకి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారని పార్టీలో కొందరు చెబుతున్నారు.