మీ పిల్లలకు బైక్ ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారా – ఇక మీరు బుక్కైనట్టే

మీ పిల్లలకు బైక్ ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారా - ఇక మీరు బుక్కైనట్టే

0
76

ఆ బైక్ తండ్రి పేరు మీద ఉండవచ్చు ఆ స్కూటీ తల్లిపేరు మీద ఉండవచ్చు.. కానీ ఇంటర్ లేదా పదో తరగతి చదివే కొడుకు కుమార్తె ఆ బైక్ స్కూటీపై రోడ్లపై తిరుగుతున్నారు, ఇక సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవడం నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో ప్రాణాలు కోల్పోతున్నారు గాయాలు అవుతున్నాయి.. పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.. ఇక పై మీరు పిల్లలకు బైక్ ఇవ్వాలంటే ఆలోచించాల్సిందే.

 

ఇక లైసెన్స్ లేకుండా సరైన పత్రాలు లేకుండా పిల్లలు బైక్ పై దొరికితే కచ్చితంగా కేసులు పెడతారు పోలీసులు

మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఎంతో మంది బలి అవుతున్నారు. దీంతో పోలీసులు నడుం బిగించారు. స్పెషల్ డ్రైవ్లతో ఇలాంటి వారిని పట్టుకుంటున్నారు.

 

మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిని జువైనల్ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇటు తల్లిదండ్రులను కూడా కోర్టులో ప్రవేశ పెడుతున్నారు. ఇక హైదరాబాద్ లో పేరెంట్స్ ఇది మర్చిపోకండి. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొందరు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు ఇక ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే పిల్లలకు బైక్ లు ఇవ్వకండి, వారికి లైసెన్స్ లేకుండా బైక్ ఇవ్వడం కూడా నేరమే.