ప్రపంచంలో అనేక కొత్త కొత్త విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తెలుస్తున్నాయి…. అయితే ఇప్పుడు ఓ కొత్త పెన్ను గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.. ఇంతకీ ఆ కొత్త పెన్ను విశేషాలు ఏమిటి అనేది చూద్దాం..
మనం ఎన్నో రకాల పరాన్న జీవులు చూశాం, ఇక పచ్చి మాంసం ఎవరైనా తింటే అందులో నెమటోడ్ లేదా టేప్ వార్మ్ వంటి పరాన్నజీవులు శరీరంలోకి చేరుతాయి.. దాని వల్ల మెదడులో ఇబ్బందులు అలాగే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.
పరాన్నీ జీవులు మీతో పాటు మీరు రాసుకొనే పెన్నులో ఉంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా.. తాజాగా ఇలంటి పెన్ను తయారు చేశారు జపాన్ వారు …బతికున్న నెమటోడ్ పరాన్న జీవిని పెన్నులో పెట్టారు. అది బయటకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఉన్న నీటిలో ఆ పరాన్న జీవి కదులుతూ ఉంటుంది. దీనిని మన కరెన్సీలో సుమారు 652 రూపాయలకు అమ్ముతున్నారు… దీనిని చాలా మంది ఆర్డర్ ఇచ్చి కొనుక్కుంటున్నారు.
ఇక ఇది సుమారు ఐదు రోజుల పాటు అందులో బతికి ఉంటుంది.. రాసే సమయంలో ఒక డిఫరెండ్ అనుభూతి ఉంటోంది అని అంటున్నారు ఆ పెన్ను వాడిన వారు.. సో మీరు ఈ పెన్ను చూస్తారా చూసేయండి ఈ ఫోటోలు
アニサキスボールペン出来たよ❗️ pic.twitter.com/DQ6P3iSK7j
— 多田水産? (@tada2547) March 24, 2021