ఆ ప్రముఖ తమిళ డైరెక్టర్ తో మహేష్ సినిమా ఒకే చేశారా ?

ఆ ప్రముఖ తమిళ డైరెక్టర్ తో మహేష్ సినిమా ఒకే చేశారా ?

0
103

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.. కాని టాలీవుడ్ టాక్ చూస్తుంటే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగులో ఉన్న రాజమౌళి ఈ సినిమా పూర్తి చేశాక మహేష్ బాబుతో సినిమా చేస్తారు అని టాక్ నడుస్తోంది.. కొద్ది రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది.

 

దసరా రోజున సినిమా అనౌన్స్ మెంట్ ఉండవచ్చని టాక్ నడుస్తోంది….తాజాగా ఆయన సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది… ఈ వార్త వినిపించడంతో మహేష్ ఎలాంటి స్టోరీకి ఒకే చెప్పి ఉంటారు అని అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.

 

ఎందుకు అంటే ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, ఆమెకి తమిళ్ లో మంచి పేరు ఉంది.

తమిళంలో సూర్య హీరోగా ఆమె తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా సినిమా విజయంతో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది.

ఇక తాజాగా ప్రిన్స్ కి కథ చెప్పారు అనే వార్త వినిపిస్తోంది, కథ చాలా కొత్తగా ఉండటంతో ఆయన ఒకే చెప్పారు అని అంటున్నారు.మరి చూడాలి ఆయన ఈ కథని ఎప్పుడు పట్టాలపైకి ఎక్కిస్తారో.