బెంగళూరులో భార్య ఉద్యోగం సొంత ఊరిలో భర్త ఉద్యోగం – భార్య ప్రియుడితో ఏం చేసిందంటే

బెంగళూరులో భార్య ఉద్యోగం సొంత ఊరిలో భర్త ఉద్యోగం - భార్య ప్రియుడితో ఏం చేసిందంటే

0
67

వీరేంద్ర రెడ్డికి గత ఏడాది సుగుణా రెడ్డితో వివాహం అయింది.. అయితే అతనికి వివాహం అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటికి వచ్చేశాడు.. అయితే భార్య కూడా ఉద్యోగం కావడంతో ఆమెకి వర్క్ ఫ్రమ్ హోమ్ కొద్ది రోజులు ఉంది. ఇటీవల కంపెనీ వారు ఆఫీసుకురమ్మన్నారు అని బెంగళూరు వెళ్లిపోయింది.. అయితే ఆమె భర్త తల్లిదండ్రులకి అనారోగ్యం అని గ్రామంలో ఉండి వారిని చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు.

 

అప్పటి వరకూ బాగానే ఉన్న భార్య తనలో మరో కోణం చూపించింది.. శివ అనే వ్యక్తితో ఆమెకి కాలేజీ డేస్ నుంచి లవ్ ఉంది, అయితే ఆస్తి లేదు ఉద్యోగం లేదు అని తల్లిదండ్రులు అతనితో పెళ్లికి నో చెప్పి వీరేంద్రతో పెళ్లి చేశారు… అయితే భర్త దూరం ఉండటంతో ఆమె కూడా ఇక ప్రియుడితో ఈ మధ్య చాటింగ్ ఫోన్ కాల్స్ చేసింది.

 

ఇక మరో ఆలోచనతో ఏకంగా ప్రియుడిని బెంగళూరు రప్పించి అతనితో కాపురం పెట్టింది.. రెంట్ కి ఇళ్లు తీసుకుని అందులో ఇద్దరూ ఉంటున్నారు, అక్కడ ఇంట్లోనుంచి వర్క ఫ్రమ్ హోమ్ చేస్తోంది. అయితే ఇటీవల వారి ఊరు వారు ఈ యువతిని ఆ శివని ఓ స్టోర్ లో చూసి భర్తకు విషయం చెబితే… సీక్రెట్ గా అతను వచ్చి చూస్తే ఇద్దరూ ఆ ఇంట్లో ఉంటున్నారు అని తేలింది. దీంతో పోలీసులని ఆశ్రయించాడు ఆమె భర్త.