తేజ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కుమారుడు సినిమా – టాలీవుడ్ టాక్

తేజ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కుమారుడు సినిమా - టాలీవుడ్ టాక్

0
85

దర్శకుడు తేజ గురించి చెప్పాలంటే టాలీవుడ్ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోలతో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేశారు… చాలా మందిని చిత్ర సీమకు పరిచయం చేశారు… తక్కువ బడ్జెట్ తో మంచి సూపర్ హిట్ సినిమాలు ఆయన తీశారు… అందుకే ఆయనని చాలా మంది నిర్మాతలు నమ్మి పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తారు… అంతేకాదు చాలా మంది స్టార్ లు ఆయన దగ్గరకు తమ వారసులని తీసుకువచ్చి సినిమా చేయమని కోరతారు.

 

అయితే తాజాగా దగ్గుబాటి వారి అబ్బాయి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..

దర్శకులుగా వంశీ .. తరుణ్ భాస్కర్ .. రవిబాబు పేర్లు వినిపించాయి. అయితే తాజాగా దర్శకుడు తేజ పేరు వినిపిస్తోంది.

అభిరామ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తేజకు అప్పగించారు అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

 

సురేశ్ ప్రొడక్షన్స్ వారితో తేజకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి… గతంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా రానాతో చేశారు ఇది రానా కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది… మంచి పేరు వచ్చింది…ఉదయ్ కిరణ్ .. నితిన్ .. నవదీప్ ను హీరోలుగా తెరకి పరిచయం చేశారు తేజ.. సో ఇప్పుడు అభిని ఎలా చూపిస్తారో అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.