కరోనా విషయం లో ముంబై ప్రజలకు గుడ్ న్యూస్

కరోనా విషయం లో ముంబై ప్రజలకు గుడ్ న్యూస్

0
32

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి… మరీ ముఖ్యంగా దేశ ఆర్దిక రాజధాని ముంబైలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ఈ సమయంలో అక్కడ మినీ లాక్ డౌన్ పరిస్దితి ఉంది, రాత్రి కర్ఫ్యూ అమలు ఉంది…ఓ పక్క వాక్సినేషన్ జరుగుతున్నా కేసులు మాత్రం దారుణంగా అక్కడ పెరిగాయి, అయితే ఇప్పుడు మిని లాక్ డౌన్ నైట్ కర్ఫ్యూతో వ్యాపారాలు అన్నీ సంస్ధలు మూసివేయడం వల్ల కొత్త కేసులు చాలా వరకూ తగ్గాయి.

 

కేవలం 5888 కేసులు నమోదు అయ్యాయి… అయితే ఏప్రిల్ 4న నమోదైన 11,163 కేసులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 50 శాతానికి తగ్గింది… ఇది గుడ్ న్యూస్ అని అంటున్నారు అధికారులు.. మరికొన్ని రోజులు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా ఆ కేసులు భారీగా తగ్గుతాయి అని అంటున్నారు.

 

పాజిటివిటీ రేటు సైతం 15 శాతానికి పడిపోయింది… కేసులు రావడం లేదు కాని మరణాలు మాత్రం ఆగడం లేదు అని తెలియచేస్తున్నారు అధికారులు. ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫలిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా కదలికలు తగ్గడం వల్ల కేసులు తగ్గాయి అంటున్నారు నిపుణులు అధికారులు.