కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి …కరోనా విజృంభిస్తోంది.. ఇక ఉత్తరాధి రాష్ట్రాలను వణికిస్తోంది కరోనా, దేశ రాజధాని డిల్లీలో కరోనా కేసులు రోజుకి వేలల్లో నమోదు అవుతున్నాయి, ఆస్పత్రిల్లో ఎక్కడ చూసినా బెడ్లు నిండిపోతున్నాయి, అన్నీ ప్రైవేట్ ఆస్పత్రిల్లో ఇదే పరిస్దితి.
దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతోంది. సమయానికి ఆక్సిజన్ లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో రోగులని కూడా చేర్చుకోవడం లేదు, గంగారం ఆసుపత్రి వద్ద హృదయవిదాకరమైన ఘటనలు కనిపిస్తున్నాయి. చాలా మంది ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ వీడియోలు చూస్తుంటే కన్నీరు వస్తోంది.
కుటుంబ సభ్యులకి కరోనా సోకితే ఏమి చేయలేని పరిస్థితిలో కుటుంబసభ్యులు ఉంటున్నారు. కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోవడంతో…ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద ఏడుస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో
Heart breaking scenes outside the emergency of Sir Gangaram Hospital in Delhi. #CovidIndia pic.twitter.com/hiXhKpvAoC
— Hemant Rajaura (@hemantrajora_) April 24, 2021