మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.? ఏం చేయాలి

మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.? ఏం చేయాలి

0
92

ఇప్పుడు చాలా మందికి ఈ టీకాపై అనేక అనుమానాలు.. అయితే ఈ కరోనా టీకా ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు వైద్యులు శాస్త్రవేత్తలు.. ఇదే విషయం చెబుతున్నారు, ఎక్కడ చూసినా టీకా గురించి చర్చ జరుగుతోంది.. అయితే మరో పక్క దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తున్నారు..

 

అయితే ఈ సమయంలో చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి… వాటిలో ముఖ్యంగా ముందు మనం తొలి డోసు తీసుకున్న తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇస్తున్నాం.. ఈ సమయంలో

మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే ఏం చేయాలి.. మరి రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే దీనికి క్లారిటీ ఇస్తున్నారు వైద్యులు.

 

మీరు తొలి డోస్ తీసుకున్న తర్వాత మీకు కరోనా వస్తే, మీరు కోలుకున్న రెండు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఒకవేళ మొదటి డోస్ కంటే ముందు కరోనా వస్తే.. రికవరీ అయిన 28 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి… ఈ విషయం తప్పక గుర్తు ఉంచుకోండి అని చెబుతున్నారు వైద్యులు నిపుణులు.