కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? వైద్యుల సలహా

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? వైద్యుల సలహా

0
37

దేశంలో కరోనా కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి… ఓ పక్క భారీగా కేసులు బయటపడుతున్నాయి రోజుకి నాలుగు లక్షల కేసులు మూడు వేల మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే , అయితే కరోనా సోకకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.. అయితే టీకా వేయించుకోవాలా వద్దా అని చాలా మంది ఆలోచన చేస్తున్నారు.

 

కచ్చితంగా టీకా వేయించుకోండి దీనిపై ఎలాంటి ఆలోచన వద్దు, ముఖ్యంగా ఈ కరోనా టీకా తీసుకుంటే కచ్చితంగా కరోనా నుంచి బయటపడవచ్చు, ఒకవేళ టీకా వేయించుకున్న వారికి కరోనా సోకినా దాని నుంచి బయటపడవచ్చు.. కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించి బయటపడుతున్నారు.

 

ఇక కరోనా సెకండ్ వేవ్ లో లక్షలాది కేసులు బయటపడుతున్నాయి, అయితే టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చాలా మందికి అనుమానం.. దీనిపై వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు.

ఈ కరోనా వ్యాక్సిన్ మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఏ వ్యాధికి ఏ వ్యాక్సిన్ వేయించుకున్న పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి…ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి, కీళ్లనొప్పులు ఇలాంటివి కనిపిస్తాయి, అయితే ఇవి రెండు మూడు రోజులు ఉండి తగ్గిపోతాయి అని తెలియచేస్తున్నారు..

 

 

 

నోట్ …కచ్చితంగా టీకా వేయించుకోండి అపోహాలు నమ్మకండి