మొదటి డోస్ ఒక వ్యాక్సిన్.. రెండో డోస్ మరొకటి తీసుకోవచ్చా? వైద్యుల సలహ

మొదటి డోస్ ఒక వ్యాక్సిన్.. రెండో డోస్ మరొకటి తీసుకోవచ్చా? వైద్యుల సలహ

0
37

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది.. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.. రోజుకి నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి.. మూడు వేల మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ సమయంలో కరోనా నుంచి రక్షణ అంటే కేవలం టీకా అనే చెప్పాలి.. కచ్చితంగా మాస్క్ ధరించాలి.. అయితే చాలా మంది ఈ టీకా తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు.. అనేక అనుమానాలు పెట్టుకుంటున్నారు.

 

అయితే టీకా ప్రతీ ఒక్కరు తీసుకోవాలని వైద్యులు నిపుణులు చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా ఈ టీకా తీసుకోవడం వల్ల కరోనా కంట్రోల్ అవుతుంది.. అయితే చాలా మందికి ఓ అనుమానం ఉంది.. ఈ కరోనా టీకా రెండు డోసులు ఒకే కంపెనీవి తీసుకోవాలా ఒకటి ఓ కంపెనీది మరొకటి మరో కంపెనీది తీసుకోవచ్చదా అని..

 

అయితే దీనిపై వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు..రెండు డోసుల్లోనూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. కోవాగ్జీన్, కోవిషీల్డ్ వేర్వేరు ప్లాట్ఫాంపై ఆధారపడి ఉంటాయి. అది ఒక డోసు ఇది మరో డోసు తీసుకోవడం వద్దు… రెండు డోసులు ఒకే కంపెనీది తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు..కచ్చితంగా మీరు ఏ డోసు వేసుకుంటున్నారు.. ఏ కంపెనీ టీకా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.