ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో — గూగుల్కు ఎంత ఖర్చు తగ్గిందంటే

ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో -- గూగుల్కు ఎంత ఖర్చు తగ్గిందంటే

0
34

2020 నుంచి ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కరోనా కేసులు దారుణంగా పెరిగాయి.. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్దితి.. అయితే ఈ ఏడాది కూడా కరోనా విజృంభించింది దాదాపు రోజుకి నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి.. అక్కడ అమెరికాలో కూడా కాస్త కరోనా విజృంభణ తగ్గింది.. కాని మొదటి వేవ్ లో లక్షలాది మంది కరోనాతో మరణించారు.

 

అయితే ఈ కరోనా వేళ చాలా వరకూ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకి ఇచ్చాయి… దీంతో కోట్లాది మంది ఉద్యోగులు ఇంటికి పరిమితం అయ్యారు.. ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ఎమ్ ఎన్ సీ కంపెనీలు ఇదే పాలసీ అమలు చేసుకున్నాయి..

 

అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల యాజమాన్యాలకు కూడా ఖర్చు తగ్గింది. ఇక కంపెనీలకు సైట్లకు ఉద్యోగులు రాకపోవడంతో చాలా వరకూ ఖర్చు తగ్గింది.తమకు ఏడాది కాలంలో దాదాపు రూ. 100 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు గూగుల్ వెల్లడించింది. .భారత కరెన్సీలో ఇది రూ. 7500 కోట్లు. ఇక గూగుల్ కంపెనీ ఉద్యోగులకి ఎన్నో సౌకర్యాలు ఇస్తుంది.. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల గూగుల్ కు దాదాపు 7500 కోట్ల ఖర్చు తగ్గిందట.