మమత ఓటమి -మరి ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే ?

మమత ఓటమి -మరి ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే ?

0
47

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించింది, అయితే ఆమె మాత్రం పోటీ చేసిన చోట ఓటమి పాలయ్యారు, అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు… అయితే ఆమె సీఎం అభ్యర్ది అని అందరికి తెలిసిందే, ఇక ఆమె ఎమ్మెల్యేగా మరో చోట నుంచి పోటీ చేయనున్నారు.

 

మమత ఓడినప్పటికీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బెంగాల్లో శాసనమండలి లేకపోవడంతో సీఎంగా కొనసాగాలంటే మాత్రం ఆమె ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా విజయం సాధించాలి, కచ్చితంగా ఆమె మరోచోట నుంచి బరిలోకి దిగుతారు ఆరు నెలల కాలంలో.

 

ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు మరణించడంతో రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక అక్కడ ఏదో ఓ ప్లేస్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు..

ఉత్తర 24 పరగాల జిల్లాలోని ఖర్దాహా

జంగీపూర్

శంషేర్గంజ్

 

ఇందులో ఆమె ఖర్దాహా నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.