మనం కొందరిని చూస్తు ఉంటాం వారు చీటికి మాటికి గోర్లు కొరుకుతూ ఉంటారు, అంతేకాదు వాటిని మొత్తం పిప్పిలా చేస్తారు.. ఆ గోర్లు చూడటానికి చాలా దారుణంగా మారిపోతాయి, అయితే ఇది చిన్నతనం నుంచి అలవాటుగా కొందరికి ఉంటుంది.. కచ్చితంగా చిన్నతనంలోనే ఈ అలవాటు ఉంటే పిల్లల చేత మాన్పించాలి.
మీరు ఓ విషయాన్ని గమనించాలి 10 ఏళ్ల వరకూ గోర్లు చాలా సాప్ట్ గా ఉంటాయి… 20 ఏళ్లకు మీడియంగా ఉంటాయి… 30 నుంచి కాస్త్ర స్ట్రాంగ్ అవుతాయి… ఇక ఇలా అలవాటు ఉంటే ఆ గోర్ల కణజాలం దెబ్బతింటుంది.. చేతికి గోరికి కూడా ఇన్ ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ అలవాటు ఉంటే మానేయాలి.
అయితే గోర్లు ఎక్కువగా పెరిగితే ఇలా కొరకాలి అనిపిస్తుంది… అందుకే వారానికి రెండుసార్లు గోర్లు కత్తిరించండి. గోర్లు అందంగా ఉండేలా చేసుకోండి …మీకు ఇక కొరకాలి అనిపించదు. ముఖ్యంగా మీరు ఆందోళన ఒత్తిడి లేకుండా ఉండాలి… అప్పుడు మాత్రమే మీకు ఈ సమస్య రాదు. చిన్నపిల్లలు ఇలా అస్తమాను కొరుకుతూ ఉంటే వారి చేతికి గ్లౌస్ లాంటివి వేయండి.