ప్రముఖ గాయకుడు ఇకలేరు

ప్రముఖ గాయకుడు ఇకలేరు

0
101

ఈ కరోనా మహమ్మారి అత్యంత దారుణంగా విజృంభిస్తోంది ..ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి, ఇక చిత్ర సీమలో కూడా ఈ కరోనా దారుణమైన విషాదాన్ని నింపుతోంది… రోజు ఎవరో ఒకరిని ఈ కరోనా బలి తీసుకుంటోంది, ప్రముఖ దర్శకులు నిర్మాతలు హీరోలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మందిపై ఇది ప్రభావం చూపించింది.

 

తాజాగా అంధ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎం.జె.సి. కోమగన్ కరోనాతో కన్నుమూశారు. ఆయన సుమారు 10 రోజులుగా చెన్నైలోని చికిత్స పొందుతున్నారు… చివరకు ప్రాణాలు కోల్పోయారు.. రవితేజ చేసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రంలోని మౌనంగానే ఎదగమని పాటలో ఆయన నటించారు.

 

అలాగే, ఆ సినిమా తమిళ మాతృకలోనూ అంధ గాయనీ గాయకులు, వాద్యకారులపై చిత్రీకరించిన పాటలో కనిపించారు. తెలుగు తమిళ చిత్ర సీమలో ఆయన చాలా మందికి పరిచయస్దులు పూర్తిగా అందులతో ఆయన సంగీత ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు.తొమ్మిది మంది సభ్యులతో 1991లో రాగప్రియ మ్యూజిక్ ట్రూప్ను నెలకొల్పి అనేక సంగీత ప్రదర్శనలు దేశంలో ఇచ్చారు.