బ్రేకింగ్ – భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

బ్రేకింగ్ - భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
41

మే నెలలో పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఈ నెలలో ప్రతీ రోజు ఎంతో కొంత బంగారం ధర పెరుగుతూనే ఉంది.. కాని తగ్గిన దాఖలాలు లేవు… ఇక వెండి ధర కూడా చుక్కలు చూపిస్తోంది బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరి నేడు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

 

 

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగింది. రూ.48,550కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 పెరుగుదలతో రూ.44,500కు ట్రేడ్ అవుతోంది.. బంగారం ధర ఈ వారంలో దాదాపు ఐదోరోజు ఇలా భారీగా పెరిగింది, ఇక దాదాపు రెండు రోజులు కేవలం 180 రూపాయలు మాత్రమే తగ్గింది.

 

బంగారం ధర ఇలా ఉంటే హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర శనివారం ఏకంగా రూ.1900 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు ట్రేడ్ అవుతోంది.. ఇక మే నెలలో ఈ 8 రోజుల్లో అత్యధికంగా వెండి ధర పెరగడం ఇదే తొలిసారి, ఈ నెలలో సుమారు 2800 పెరిగింది వెండి కిలో ధర.