భూ కబ్జా కేసులో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే , కాప్రా తహసీల్దార్ | Land grabbing Case File On Trs Mla and Kapra Mro

Land grabbing Case File On Uppal Mla and Kapra Mro

0
98

ఉప్పల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిపై కేసు భూవివాదంలో చిక్కుకున్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేతో పాటు కాప్రా తహసీల్దార్ గౌతంకుమార్‌పై కేసు నమోదు చేశారు. 120బీ,166ఏ, 167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 IPC సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. కాప్రాలో సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూవివాదంలో సుభాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ భూవివాదంలో సుభాష్‌రెడ్డిపై తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. సుభాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేశారని మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు.తాజాగా కోర్టు ఆదేశాలతో  ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

trs mla Bhethi Subash Reddy

భూవివాదాలు టీఆర్‌ఎస్ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ భూ కబ్జా వివాదంలో చిక్కుకున్నారు. దీని పై తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘల మీద ప్రభుత్వ అధికారులకు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఆరోపణలు ఎదురుకుంటున్న ఈటెల రాజేందర్‌ కు కనీసం నోటిసులు ఇవ్వకుండానే విచారణ చేసి అసైన్డ్ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి నివేదిక అందచేసారన్న విషయం తెలిసిందే.

అయితే ఈటల రాజేందర్‌ పై మరో భూ కబ్జా ఫిర్యాదు వచ్చింది. ఈటల కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్‌ ముదిరాజ్‌ అనే వ్యక్తి తాజాగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తును ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

కొత్త వివాదం

కాప్రా తహసీల్దార్ పై క్రిమినల్ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలంగాణా రెవిన్యూ ఎంప్లాయిసెస్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ భూముల పరిరక్షణ భాగంగా తీసుకున్న చర్యలకు గాను క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు తెలంగాణా రెవిన్యూ ఎంప్లాయిసెస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి.

ప్రభుత్వ భూముల పరిరక్షణ రెవిన్యూ శాఖ ప్రధాన విధి.ప్రభుత్వ భూముల పర్యవేక్షణలో భాగంగా తహశీల్దార్లు అనేక చర్యలు తీసుకోవాల్సివస్తుంది.కబ్జాదారులపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించి అరికట్టడానికి వారిపై క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేస్తాము.కాప్రా తహశీల్దార్ కె.గౌతమ్ కుమార్ తన విధి నిర్వహణ లో భాగంగా కాప్రా గ్రామ పరిధిలోని సర్వే నెం.152 &153 లో గల కస్టోడియన్ భూమిని అక్రమించడానికి ప్రయత్నించిన కొందరు ప్రయివేటు వ్యక్తులపై గత మార్చిలో క్రిమినల్ కేసు ధాఖలు చేశారు. ఈచర్యకు ప్రతీకారంగా తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి ఆయనపై క్రిమినల్ కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు తెలంగాణా రెవిన్యూ ఎంప్లాయిసెస్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు.

మెజిస్టీరియల్ అధికారాలు కలిగిన కాప్రా తహసిల్దార్ పై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో కూడా రాష్ట్రంలో అనేక చోట్ల తహసీల్దార్లపై ఎస్సీ,ఎస్టీ ,ఇతర కేసులు నమోదు చేసారు. ఈ చర్యల వల్ల తాసిల్దార్లు ఒకవైపు కబ్జాదారుల దురాగతాల వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి రావడమే కాక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.వెంటనే కాప్రా తాసిల్దార్ పై నమోదు చేసిన కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని ‘ట్రెసా’ రాష్ట్ర కార్యవర్గం తరపున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న అదేశాలు ,చట్టాల ప్రకారం తహసీల్దార్ పై కేసు నమోదుచేయాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తప్పక ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో రెవెన్యూశాఖ సిబ్బంది ప్రజలకు సరియైన సేవలందించడం సాధ్యం కాదు.

వంగ రవీందర్ రెడ్డి,
అధ్యక్షుడు.
తెలంగాణా రెవిన్యూ ఎంప్లాయిసెస్ సర్వీసెస్ అసోసియేషన్.