కరోనా పేషెంట్స్ కోసం ఆనందయ్య ఇస్తున్న మందుపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన ఇప్పటి వరకు సుమారు 80వేల మందికి ఉచితంగా తన మందును పంపిణీ చేశారు. అయితే ఇందులో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు విమర్శలు చేసేవారున్నారు. లేదు అసలు ఆనందయ్య మందులో ఎలాంటి హానికారక వస్తువులు లేవని, ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పేవారున్నారు. సరే విమర్శలు, ప్రతి విమర్శలు అలా ఉంచితే…
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో బలేగా చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియోలో ఏముందంటే… బొణిగె ఆనందయ్య తయారు చేసి 5వ రకం మందును ఐసియులో ఉన్న ఒక పేషెంట్ కండ్లలో వేశారు. ఆ పేషెంట్ కు కంట్లో మందు వేయకముందు ఆక్సిజన్ల లెవల్స్ 90 లోపు ఉన్నాయి. ఆనందయ్య పంపిణీ చేసిన కంటిమందు వేసిన 2 నిమిషాల్లోనే సదరు ఐసియు పేషెంట్ ఆక్సిజన్ లెవల్స్ 90 పైకి ఎగబాకాయి. దీన్ని ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బంది విక్టరీ సింబల్ చూపుతూ ధృవీకరించారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు అప్పటివరకు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉన్న సదరు పేషెంట్ తర్వాత రిలాక్స్ అయ్యి మాట్లాడారు కూడా.
వీడియో లింక్ కింద ఉంది మీరూ చూడొచ్చు. (నోట్ : ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మాత్రమే)
https://www.facebook.com/watch/?v=189612782935252