ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీలో, తెలంగాణలో ఆనందయ్య ముందు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సర్వేపల్లిలో అందరికి మందు ఇచ్చిన తర్వాత, మిగిలిన ప్రాంతాల వారికి మందు ఇస్తాము అన్నారు ఆనందయ్య. ఇక చాలా మంది ఆనందయ్య మందు కోసం, ఈ ప్రాంతం వారిని వాకబు చేస్తున్నారు. ఎప్పుడు ఈ మందు తీసుకుందామా అని చూస్తున్నారు.
అయితే ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఔషధం అందిస్తామని ఆనందయ్య తెలిపారు. ఇక్కడకు ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రావద్దని తెలిపారు ఆనందయ్య. కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదంటూ ఆనందయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పంపిణీకి వనరులు సమకూరడం లేదని, విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేవని ఆనందయ్య బాధపడ్డారు.
ప్రభుత్వం నుంచి తమ మందుకి అనుమతి మాత్రమే వచ్చింది, ఎలాంటి సహకరం లేదని ఆయన తెలిపారు.ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తామంటున్నారు ఆనందయ్య .మందు కావలసినవారు అధికారుల దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలని ఆనందయ్య సూచించారు.ఇక కరోనా వచ్చిన వారి ఇంటికే మందు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.