బ్రేకింగ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం – వెండి ధరలు

Today Gold And Silver Rates

0
36
Gold

జూన్ నెల బంగారానికి బాగా కలిసివస్తోంది. బంగారం ధర పరుగులు పెడుతోంది. కేవలం ఈ నెలలో ఒక్కరోజు మాత్రమే తగ్గిన పుత్తడి ధర, ప్రతీ రోజు పరుగులు పెడుతూనే ఉంది. నేడు కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. మరి నేడు బంగారం వెండి ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయి ఓసారి రేట్లు చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగింది. దీంతో రేటు రూ.50,080కు చేరింది. ఇక ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 పెరుగుదలతో, రూ.45,910కు చేరింది. బంగారం ధర ఈ నెలలో ఐదు రోజులు పెరుగుదల నమోదు చేసింది.

ఇక పుత్తడి ధర ఇలా ఉంది. మరి వెండి ధర ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు కిలో వెండి రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,300కు చేరింది. వచ్చే రోజుల్లో పుత్తడి, వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు. ఫ్యూచర్స్ ట్రేడ్ బట్టీ ఆగస్ట్ నాటికి రూ.60 వేలకు బంగారం ధర చేరే అవకాశం ఉంది అంటున్నారు.