మొసలి నుంచి తప్పించుకున్న ఏనుగు – ఈ వీడియో చూడండి

The elephant that escaped from the crocodile video

0
166

 

అడవిలో అనేక జంతువులు ఉంటాయి. వాటి ఆహారం కూడా అక్కడే అవి సంపాదించుకుంటాయి. సాధు జంతువులు అయితే పళ్లు, ఆకులు, కూరగాయలు ఇలాంటివి తింటాయి. ఇక వేటాడే జంతువులైతే వాటి కంటే చిన్నజంతువులని వేటాడి చంపి తింటాయి.

చిరుత, సింహం, పులి, మొసలి ఇలాంటి జంతువులు అడవిలో చిన్న జంతువులపై అటాక్ చేసి, ఆహారంగా తీసుకుంటాయి. ఇక నీళ్లల్లో ఉండే మొసలి, ఎక్కువగా ఆ నీరు తాగడానికి వచ్చే జంతువులపై అటాక్ చేస్తుంది. వాటి బలమైన దవడలతో ఆ జంతువులని పట్టి చంపేస్తుంది.

ఇలాగే నీరు తాగేందుకు వచ్చిన ఏనుగుని మొసలి ఉడుంపట్టు పట్టింది. కానీ ఆ ఏనుగు చాకచక్యంగా తప్పించుకుంది. నది ఒడ్డుకు వచ్చిన ఏనుగుల గుంపు, నీరు తాగుతున్న సమయంలో ఈ మొసలి అటాక్ చేసింది. ఏనుగు ఎలా తప్పించుకుందో ఈ ఈడియోలో చూడండి.

https://twitter.com/afaf66551/status/1401440005118124033