ఈ కరోనా చాలా కుటుంబాలని ఆర్ధికంగా, మానసికంగా చాలా కృంగదీసింది. లక్షలు పోశారు ఆస్పత్రులకి. అయినా కొందరి ప్రాణాలు దక్కలేదు. అయితే కరోనా నుంచి కోలుకున్నామని ఆనందంలోఉంటే కొందరికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరిని బ్లాక్ ఫంగస్ ఇబ్బంది పెడుతోంది.
కరోనా కంటే బ్లాక్ ఫంగస్ చికిత్సకు అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. మహారాష్ట్రలోని విదర్భకు చెందిన నవీన్ పాల్ అనే వ్యక్తి రూ.కోటిన్నర ఖర్చు చేశారు. ఆయన గత ఏడాది అక్టోబర్ లో కరోనా నుంచి కోలుకున్నారు, ఆ తర్వాత ఆయనకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి.
అప్పటికి అదే తొలి కేసు దీంతో అనేక పద్దతుల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, అయితే ఆయన తన ఎడమ కంటిని కోల్పోయారు. దాదాపు ఆరు ఆసుపత్రుల్లో 13 శస్త్రచికిత్సల తర్వాత ఆయన కోలుకున్నారు. ఆయన భార్య రైల్వే ఉద్యోగి కావడంతో చికిత్సకు కోటి రూపాయలను రైల్వే శాఖ ఇచ్చింది. మిగతా రూ.48 లక్షలు ఆయన కుటుంబం చూసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఆయనకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు, ఇంటికి వచ్చిన కొద్ది రోజులకి పన్ను, కన్ను బాగా ఎఫెక్ట్ అయింది. దీంతో బ్లాక్ ఫంగస్ అని తేలింది.