డాక్టర్ల సామూహిక అత్యాచారం : యువతి మృతి ?

0
118

ఉత్తరప్రదేశ్ (ప్రయాగరాజ్) :  దవాఖానాలో డాక్టర్లు ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత యువతి మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ దవాఖానాలో జరిగింది. బాధిత యువతి కుటుంబసభ్యులు, ఆమె రాసిన లేఖలో వెల్లడించిన వివరాలు ఇవీ.

మీర్జాపూర్ యువతి ఒకరు మే 29న పేగు సమస్యతో ప్రయాగరాజ్ లోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశారని సదరు బాధిత యువతి తన సోదరుడికి ఫిర్యాదు చేశారు. అక్కడి డాక్టర్లు మంచివారు కాదని, తనకు ఆపరేషన్ కూడా చేయలేదని తనపట్ల తప్పుగా ప్రవర్తించారని ఒక కాగితం మీద రాసిచ్చారు. దీంతో స్థానిక పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు.

అనంతరం బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేస్తామని పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత యువతి మరణించింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. యువతికి ఆపరేషన్ చేసిన సమయంలో ఇద్దరు మగ వైద్యులు ఉన్నారని, నలుగురు మహిళా సర్జన్లు, నర్సులు ఉన్నారని, అత్యాచారం జరిగిందనే విషయాన్ని సదరు ప్రిన్సిపాల్ ఎస్పీ సింగ్ కొట్టిపారేశారు. మరోవైపు బాధిత యువతికి మతిస్థిమితం సరిగా లేనందున డాక్టర్లపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఉండొచ్చని స్థానిక పోలీసులు అంటున్నారు.