కాన్సర్ బారిన పడిన సోనాలి

కాన్సర్ బారిన పడిన సోనాలి

0
157

తెలుగు లో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది సోనాలి బింద్రే. తెలుగుతో పాటు హిందీ లో కూడా స్టార్ స్టేటస్ ని అందుకుంది సోనాలి బింద్రే. తెలుగు లో మెగా స్టార్ చిరంజీవితో కలిసి “ఇంద్ర” “శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించింది సోనాలి. అలాగే మహేష్ బాబుతో “మురారి” వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మెరిసింది.

ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ తన ట్విట్టర్ అకౌంట్ తన హెల్త్ కి సంభందించిన ఒక షాకింగ్ న్యూస్ ని పబ్లిక్ గా పంచుకుంది. సోనాలి బింద్రే గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతుందట. ప్రస్తుతం సోనాలి బింద్రే కాన్సర్ యొక్క నాలుగవ స్టేజి ని ఎదురుకుంటుంది.

అయితే ఈ ట్రీట్మెంట్ కోసం సోనాలి న్యూయార్క్ వెళ్ళింది. ఈ విషయం తెలియగానే సోనాలి బింద్రే అభిమానులు అలాగే పలువురు సినీ ప్రముఖులు సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలి అని ప్రార్దిస్తున్నారు. గత కొంతకాలంగా కేవలం టీవి షోస్ మాత్రమే చేస్తున్న సోనాలి ఇప్పుడు ఆ టీవి షోస్ కి కూడా వదిలేసింది.