హైదరాబాద్ : ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన జారీ చేశారు.
రైతుబంధుకు అర్హులు 63.25 లక్షల మంది
– తుదిజాబితా విడుదల చేసి వ్యవసాయ శాఖకు అందజేసిన సీసీఎల్ఎ
– 63 లక్షల 25 వేల 695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాలకు రూ.7508.78 కోట్లు అవసరమవుతాయి
– గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది పెరిగిన రైతులు, నూతనంగా చేరిన 66 వేల 311 ఎకరాలు
– మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలి
– బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దు .. ఏమైన అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారు
– అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు అర్హులు, 12.18 లక్షల ఎకరాలు, రూ.608.81 కోట్లు
– అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 39,762 మంది రైతులు అర్హులు, 77 వేల ఎకరాలకు రూ.38.39 కోట్లు
– ఏడు జిల్లాలకు రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లు
– 11 జిల్లాలకు రూ.200 నుండి రూ.300 కోట్లు
– 10 జిల్లాలకు రూ.100 నుండి రూ.200 కోట్లు
– వరంగల్ అర్బన్ , ములుగు, మేడ్చల్ జిల్లాలకు రూ.100 కోట్ల లోపు నిధులు
– ఈ నెల 15 నుండి 25 వరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేయబడతాయి
– ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి .. గత ఏడాది నుండి కరోనా విపత్తులోనూ వరసగా మూడోసారి రైతుబంధు నిధులు
– గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం.