తెలంగాణ కరోనా బులిటెన్ : 2 జిల్లాల్లో త్రిబుల్ డిజిట్, 7 జిల్లాల్లో సింగిల్ డిజిట్

0
84

కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో గణనీయంగా పడిపోయింది. ఆదివారం ప్రభుత్వం వెలువరించిన బులిటెన్ లో మొత్తం నమోదైన కేసులు 1280 కాగా 15 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసి, ఖమ్మంలో మాత్రమే త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు కాగా మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక సింగిల్ డిజిట్ కేసులు వచ్చిన జిల్లాల పేర్లు చూస్తే ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నారాయపేట, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి. అయితే కామారెడ్డి జిల్లాలో ఒకే ఒక్క కేసు నమోదు అయినట్లు బులిటెన్ లో సమాచారం అందింది. జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.

ఆదిలాబాద్ 4 కేసులు

కొత్తగూడెం 69

జిహెచ్ఎంసి 165

జగిత్యాల 24

జనగామ 8

జయశంకర్ భూపాలపల్లి 16

జోగులాంబ గద్వాల 14

కామారెడ్డి 1

కరీంనగర్ 74

ఖమ్మం 156

కొమరం భీం ఆసిఫాబాద్ 5

మహబూబ్ నగర్ 40

మహబూబాబాద్ 52

మంచిర్యాల 35

మెదక్ 5

మేడ్చల్ మల్కాజ్ గిరి 49

ములుగు 12

నాగర్ కర్నూల్ 14

నల్లగొండ 80

నారాయణపేట 5

నిర్మల్ 4

నిజామాబాద్ 17

పెద్లపల్లి 48

రాజన్న సిరిసిల్ల 14

రంగారెడ్డి 76

సంగారెడ్డి 38

సిద్దిపేట 46

సూర్యాపేట 59

వికారాబాద్ 25

వనపర్తి 18 వరంగల్ రూరల్ 29

వరంగల్ అర్బన్ 5

యాదాద్రి భువనగిరి 23

 

రాష్ట్ర వ్యాప్త సమాచారం :

తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన ఆదివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసులు 1280 మాత్రమే నమోదయ్యాయి. కేసుల సంఖ్య చూస్తే నిన్నటికి ఇవాళ్టికి చాలా తేడా కనబడుతున్నది. నిన్న 1771 కేసులు నమోదు కాగా ఇవాళ 1300 దిగువకు పడిపోయాయి. నిన్న లక్షా 20వేల టెస్టులు చేయగా ఇవాళ 91,621 టెస్టులు చేశారు. అయితే మరణాల సంఖ్య నిన్నటి కంటే పెరిగింది. నిన్న 13 మంది మరణించగా ఇవాళ 15 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఇవాళ కోలుకున్న వారి సంఖ్య కొత్త కేసుల కంటే డబుల్ ఉంది. 2261 మంది ఇవాళ కోలుకున్నారు.

ఈరోజు కోలుకున్న వారి సంఖ్య 2261

ఈరోజు మృతుల సంఖ్య 15

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 21137

ఇవాళ చేసిన కోవిడ్ టెస్టుల సంఖ్య 91,621

పెండింగ్ లో ఉన్న రిపోర్టుల సంఖ్య 1663