గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 గా ఉంది – ఎందుకు ధర పెరుగుతోంది

eggs rate increasing due to corona

0
43

కరోనా కాలంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఉన్న రేటు రేపు ఉండటం లేదు. ఇక పండ్లు, కూరగాయలు, కిరాణా వస్తువులు, పప్పులు, నూనెలు, ఇలా అన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి. ఈ కరోనా సమయంలో చాలా మంది పండ్లు ఎక్కువగా కొంటున్నారు, దీంతో వాటి ధరలు పెరుగుతున్నాయి.

ఇక చాలా మంది చికెన్ని కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రతీ రోజు కోడి గుడ్డు తీసుకుంటున్నారు. దీంతో ఏకంగా ఒక్కో ప్రాంతంలో కోడి గుడ్లు ఏడు రూపాయలు పెట్టినా దొరకడం లేదు. అయితే ఎగ్స్ కు ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది అంటే. చాలా మంది ఇప్పుడు కరోనా భయంతో మంచి ప్రొటీన్ ఫుడ్ తింటున్నారు. అంతేకాదు కరోనా వచ్చిన వారు తగ్గిన వారు కూడా నిత్యం తమ ఆహారంలో గుడ్లు తీసుకుంటున్నారు.

దీంతో గుడ్డు ధరలు కూడా కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం ఒక గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 గా ఉంది. కరోనాకి ముందు ఎగ్స్ ధర వంద గుడ్లు రూ.350 నుంచి 400 ఉండేవి. ఇప్పుడు వంద మార్కెట్ బట్టీ 600 నుంచి 700 ధర ఉంటున్నాయి. జూన్ నెలలోనే ఒకేసారి రూ.1.57 పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.