సినిమా పరిశ్రమలో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాలు ఎవరూ వదులుకోరు. ఒకే ఒక్క సినిమా వారి జీవితాలను మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి వెనుతిరిగి చూడని నటులు ఉన్నారు. అయితే ఇప్పుడు వెండితెరపైనే కాదు బుల్లితెరలో కూడా చాలా మంది ముద్దుగుమ్మలు సత్తా చాటుతున్నారు.
ఇక బుల్లితెరలో యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చి, వెండి తెరపై సినిమాలతో అలరిస్తున్న బుల్లితెర యాంకర్స్ ఎవరు, వారి సినిమాలు ఏమిటో చూద్దాం.
అనసూయ– జబర్థస్ద్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది, నాగ సినిమాతో వెండి తెరపై అలరించారు.సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్ధలం సినిమాలు ఆమెకి ఎంతో పేరు తెచ్చాయి.
కలర్స్ స్వాతి కలర్స్ షోతో ఎంతో పేరు సంపాదించుకుంది స్వాతి. తర్వాత ఆమె అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్ అయింది. తర్వాత పలు చిత్రాలు చేసింది.
నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నీహారిక. ముందు డ్యాన్స్ షోకి యాంకర్గా చేసి ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
రష్మీ బుల్లితెరలో ఎంతో ఫేమ్ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది. జబర్ధస్త్ లో యాంకర్ గా కొనసాగుతూ పలు సినిమాలు చేస్తోంది.
శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరలో సత్తా చాటింది శ్రీముఖి. ఆమె వెండి తెరకు జులాయి సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత చంద్రిక సినిమాలో హీరోయిన్ గా చేసింది.