లాక్‌డౌన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు రానున్నాయి.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైల్స్ నడపనున్నారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు మెట్రో రైల్ ఉంటుందని హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
ప్రయాణికులు కరోనా జాగ్రత్తలతో ప్రయాణించాలని, మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం వెల్లడించింది.