అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంపై ఎంతో వర్క్ చేస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో షూటింగును మొదలుపెట్టి జూలై నెలాఖరున షూటింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి అని చూస్తున్నారు.
పుష్ప సినిమాకి సంబంధించిన నిర్మాణానంతర పనులను ఆగస్టు – సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేయాలి అని చూస్తున్నారు. ఇక ఈ సినిమా దసరాకి వస్తుంది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
పుష్ప సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇక బన్నీ అభిమానులు మాత్రం ఈ వార్త విని చాలా హ్యీపీగా ఉన్నారు.