తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు జనాలు ఇది మరవద్దు

If Corona decreased, People should not forget this

0
31

కరోనా మొదటి వేవ్ లో కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారు. దీని వల్ల ఎంత దారుణం జరిగిందో తెలిసిందే. ఇక సెకండ్ వేవ్ చాలా కుటుంబాలను పట్టి పీడించింది. ఈ సమయంలో చాలా మంది తమ వారిని కోల్పోయారు. అయితే మాస్క్ లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోని వారిని ఈ కరోనా అస్సలు వదిలిపెట్టలేదు.

ఇక సెకండ్ వేవ్ కాస్త ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చింది. చాలా రాష్ట్రాలు మళ్లీ అన్ లాక్ లోకి వచ్చాయి. తెలంగాణ కూడా వచ్చింది. అయితే కేసులు తగ్గుతున్నాయి కదా అని మళ్లీ గుంపులుగా తిరగడం, ఫంక్షన్లు, టూర్లు ,ప్రయాణాలు, అధిక గేదరింగ్స్ ఇలా చేస్తే మాత్రం మళ్లీ కరోనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

నిన్న 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ లో 141 కేసులు వచ్చాయి. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం అనేది మరవద్దు.