భోజ‌నం తిన్న త‌ర్వాత స్నానం చేయ‌వ‌చ్చా మంచిదా – చెడా

Is it better to take a bath after eating?

0
111

ఈ రోజుల్లో బిజీ లైఫ్ అయిపోయింది. ఉద్యోగాలు 24 గంట‌ల్లో మూడు షిఫ్టులు ఎప్పుడు ఎవ‌రు ఏం తింటున్నారో తెలియ‌ని ప‌రిస్దితి. అయితే కొంద‌రు అస‌లు జంక్ ఫుడ్ కి బాగా అల‌వాటు ప‌డుతున్నారు. ఇక ఆహార అల‌వాట్లు చాలా వ‌ర‌కూ మారిపోయాయి, అయితే కొంద‌రు స్నాం చేసిన త‌ర్వాత‌ భోజ‌నం చేస్తారు మ‌రికొంద‌రు భోజ‌నం ముందు స్నానం చేస్తారు.

భోజనం చేసి స్నానం చేయడం కొంద‌రికి అలవాటు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు అన్నం తిన్న‌వెంట‌నే స్నానం చేయ‌కండి.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని అంటున్నారు. కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తిన్న తర్వాత వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పొట్ట‌పై జీర్ణ వ్య‌వ‌స్ధ‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఇలా చేస్తే వాంతులు క‌డుపులో అల్స‌ర్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. తిన్న తర్వాత చల్లటి షవర్ బాత్ చేయొచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక మీకు అర్జెంట్ ప‌ని ఉంటే తిన్న త‌ర్వాత 40 నిమిషాల‌కు స్నానం చేయండి.