తెలంగాణ గురుకులాలకు విద్యార్థుల ఎంపిక : లిస్ట్ లో మీ పేరు కోసం ఇలా చెక్ చేయండి

0
101

తెలంగాణలోని ఎస్సీ గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేందుకు విద్యార్థుల ఎంపిక పూర్తయింది. ఈమేరకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా స్టూడెంట్స్ ను ఎంపిక చేసినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 126 గురుకుల కళాశాలల్లో 10,800 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంపికైన విద్యార్థుల వివరాల కోసం www.tswreis.in , www.tswreis.an.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించారు. ఆయా కళాశాలలకు ఎంపికైన అభ్యర్థులు జూన్ 23 నుంచి జులై 5వ తేదీ వరకు విద్యార్హత ధృవపత్రాలతో సీట్ వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ప్రవీణ్ కుమార్ తెలిపారు.