అన్నీ దేశాల్లో కరోనా టీకా స్పెషల్ డ్రైవ్ లు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలి అని చెబుతున్నారు. అయితే ఎవరైనా టీకా తీసుకోను అంటే కొన్ని దేశాల్లో పెద్ద పట్టించుకోవడం లేదు కాని, మరికొన్ని దేశాల్లో మాత్రం కఠిన శిక్షలు వేస్తాం అంటున్నారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో కరోనా టీకా తీసుకోను అనేవారికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. ఎవరైనా టీకా తీసుకోము అని చెబితే వారు జైలుకి వెళ్లాలన్నారు,
కరోనా వల్ల కఠిన నిబంధనలు తప్పవని స్పష్టం చేశారు. టీకా తీసుకోని వారు వైరస్ వ్యాప్తి చేస్తూనే ఉంటారని తెలిపారు. ఇలాంటి వారి వల్ల కచ్చితంగా కరోనా పెరుగుతుంది అని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోను అంటే పందులకు ఇచ్చే ఐవర్‌మెక్టిన్ ఔషధం ఇస్తామని హెచ్చరించారు.
అప్పుడు వైరస్‌తో పాటు మీరూ చనిపోతారని వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లో 1,372,232 కేసులు నమోదు అయ్యాయి ఇప్పటి వరకూ.