ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన వ్యక్తి మన భారతీయుడే. 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది. అవును మీరు విన్నది అక్షర సత్యం.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విరాళం ఇచ్చి ప్రధమ స్థానంలో నిలిచింది మన భారతీయుడు జెంషెట్జీ టాటా. ఇప్పుడు ఉన్న టాటా గ్రూప్ ని స్ధాపించింది ఆయనే. ఈ గ్రూపు మొదలైన ఏడాది నుంచి ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. గడిచిన వంద సంవత్సరాలలో మొత్తం టాటా గ్రూప్ నుంచి ఈ నగదు అందించారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా 102 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారట. ఇప్పటి వరకూ ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించలేదు.టాటా 1870 లలో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ వీవింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించారు.టాటా ట్రస్ట్ల ద్వారా సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.